Info Updated on 25-06-2020 : అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) పరీక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయం తరఫున ప్రకటన విడుదల చేస్తూ.. ‘యూజీ, పీజీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదు. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటి వరకు ప్రయత్నాలు చేశాం. సాధ్యా సాధ్యాలపై అన్ని వర్సిటీల వీసీలు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నాం. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం వైఎస్ జగన్తో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటంపై తుది నిర్ణయం వెల్లడిస్తాం.’ అని పేర్కొన్నారు. కాగా, ఒంగోలులోని తన క్యాంపు కార్యాల యంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ, బీటెక్ తదితర పరీక్షల నిర్వహణపై వీసీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
Last edited: